శేఖర్‌ను పెళ్లి చేసుకోవద్దని మా అమ్మ ఒత్తిడి చేసింది : సుచిత్ర కృష్ణమూర్తి

మంగళవారం, 11 జులై 2023 (12:54 IST)
ప్రముఖ దర్శకుడు, తన మాజీ భర్త శేఖర్ కపూర్ గురించి నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను మోసగించడంతోనే తమ వైవాహిక బంధం ముగిసిందన్నారు. వ్యక్తిగత జీవితంలో ఆయనకు నిజాయతీ లేదని ఆరోపించారు. శేఖర్ కపూర్ ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. 
 
శేఖర్ కపూర్‌తో ప్రేమ, పెళ్లి గురించి సుచిత్ర చెబుతూ, 'సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి నేను వచ్చా. స్కూల్లో చదువుతుండగానే నాకు అవకాశాలు వచ్చాయి. కళాశాలలో చదువుతున్నప్పుడు నాకు 'కభీ హా కభీ'లో తొలి అవకాశం వచ్చింది. అదేసమయంలో మలయాళంలో కూడా నటించా. పరిశ్రమపై నా తల్లిదండ్రులకు సదాభిప్రాయం లేకపోవడంతో వాళ్లకు అబద్ధం చెప్పి సినిమాల్లో పని చేశా. శేఖర్ పరిచయం అయ్యాక ఆయన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆయనకు నేను సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. అదేమీ నాకు పెద్ద విషయం కాకపోవడంతో నేను మరో ఆలోచన లేకుండా ఆయన మాటకు అంగీకరించాను'
 
'శేఖర్ కపూర్‌తో వివాహం నా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. శేఖర్ నా కంటే వయసులో పెద్దవాడు కావడం, అప్పటికే విడాకులు తీసుకోవడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని పెళ్లి చేసుకోవద్దని మా అమ్మ పలుమార్లు చెప్పింది. శేఖర్‌ను మర్చిపోవాలని సూచించింది. కానీ, నాకు ఆయనను వదులుకోవడం అప్పట్లో ఇష్టం లేకపోయింది. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది. ఇద్దరి మధ్య పొసగక పోవడంతో మేం విడిపోవాల్సి వచ్చింది' అని ఆమె చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు