సుకుమార్ ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే... మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానాని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ నిర్మించిన సినిమా ఉప్పెన. ఈ చిత్రం ద్వారా చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడే అయినా... దీనికి అంతా సుకుమారే.
ఈ సినిమా ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే.. క్లైమాక్స్ విషయంలోనే టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.... ఈ సినిమాకి హ్యాపీ ఎండింగ్ కాదు.. శాడ్ ఎండింగ్. ఇలాంటి శాడ్ క్లైమాక్స్‌లు మనకు అంతగా కలిసిరావు. అదే తమిళ్ ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చుతాయి. అయితే.. తెలుగు ప్రేక్షకులకు ఇది నచ్చుతుందా అని డౌట్ పడుతున్నారు. సుకుమార్ ఈ సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది సన్నిహితులకు చూపించాడని వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాడని తెలిసింది.
క్లైమాక్స్ మార్చమని చాలామంది చెబుతున్నారట. అయితే... సుకుమార్ గానీ, బుచ్చిబాబు కానీ ఒప్పుకోవడం లేదట. నిర్మాతలు కూడా క్లైమాక్స్ మార్చమని చెబుతున్నారట. సుకుమార్ నో అంటున్నారట. నో అని చెప్తున్నాడు కానీ రిజెల్ట్ ఎలా ఉంటుందో అని సుకుమార్ టెన్షన్ పడుతున్నారని సమాచారం.