గుంటూరు టాకీస్ సీక్వెల్‌లో మహిళా డాన్‌గా సన్నీ లియోన్..

బుధవారం, 5 అక్టోబరు 2016 (10:57 IST)
సన్నీలియోన్ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ''కరెంట్‌ తీగ'' సినిమాలో టీచర్‌గా కొన్ని సీన్లు, ఒక పాటతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సన్నీలియోన్ తాజాగా హంటర్‌ రాణిగా డాన్‌గా అవతారం ఎత్తనుంది. గుంటూరు టాకీస్‌ సీక్వెల్‌గా రూపొందుతున్న ''గుంటూరు టాకీస్‌ 2'' చిత్రంలో ఈ పాత్ర చేయనుంది. మహిళా డాన్‌గా అమ్మడు అద్భుతంగా నటించిందని చిత్ర దర్శకనిర్మాత రాజ్‌కుమార్‌ వెల్లడించారు. 
 
అందాల ఆరబోతతో పాటు అమ్మడు గెటప్ డిఫెరెంట్‌గా ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలో 20 రోజులు సన్నీకి సంబంధించిన సీన్లు తెరకెక్కిస్తామని నిర్మాత తెలిపారు. దక్షిణాదిన ఆమె పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నది మా చిత్రంలోనే. తమిళం‌, హిందీలోనూ విడుదల చేస్తాం. దసరా నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. మార్చిలో విడుదల చేస్తాం. కుటుంబకథా చిత్రంగా మలుస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి