'24'కు అర్థమే మారిపోయింది.. 'టైటిల్'పై సెటైర్లు

శుక్రవారం, 6 మే 2016 (21:42 IST)
తమిళ హీరో సూర్య నటించిన '24' సినిమాకు అర్థమేమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అసలు ఎందుకు ఈ తరహా టైటిల్‌ పెట్టాలరనేది సినీగోయర్లు ఓ కొత్త అర్థాన్ని చెబుతున్నారు. ఈ సినిమా ఎవరు చూసినా అద్భుతం అంటున్నారు. హాలీవుడ్‌ స్థాయిలో సినిమా తీశారని చెబుతున్నారు. 
 
క్రియేటివిటీ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ అంటూ పొగుడుతున్నారు. కానీ.. టైటిల్‌కు అర్థం మాత్రం ఇలా చెబుతున్నారు. దర్శకుడు, హీరోను బట్టే టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు రెండు పాత్రలు చేశాడు. ఒకటి.. దర్శకత్వం.. రెండోది.. డాక్టర్‌గా నటించడం. ఇక సూర్య ఏకంగా మూడు పాత్రలు పోషించడంతోపాటు నిర్మాతగా 4వ పాత్ర పోషించాడు కాబట్టి.. రెండూ కలిపితే 24 అని చమత్కరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి