బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అందాల భామ తాప్సీ నటించిన పింక్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రాగా, రోజులు పెరిగే కొద్ది మరింత ఎక్కువ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రానివిధంగా రివ్యూయర్లు పింక్కు ఐదుకు ఐదు స్టార్లు ఇచ్చారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో క్రమంగా థియేటర్లు, మల్టీప్లెక్సులలో ప్రేక్షకుల సందడి పెరుగుతోంది.
ముంబైలో మీడియాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో హీరోయిన్ తాప్సి మాట్లాడుతూ.. మూవీపై ఒక్కరు కూడా నెగెటీవ్‌గా మాట్లాడటంలేదని, తనను ఈ సినిమాకు ఎంచుకున్నందుకు నిర్మాత షూజిత్ సర్కార్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పింది. అంతేకాదు అమితాబ్‌తో సహా చిత్ర బృందం మొత్తం చూస్తుండగానే షూజిత్ కాళ్లు పట్టుకుంది.