నాగార్జున తాజా సినిమా `బంగార్రాజు`. ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో ముగింపు దశకు చేరుకుంటుంది. పతాక సన్నివేశాలను ఈనెల 25 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున మరో నూతన చిత్రం చేస్తున్నారు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.