టిల్లూ స్క్వేర్ లిప్ లాక్ సీన్లే కావాలంటూ ఆఫర్ల వెల్లువ: తలపట్టుకుంటున్న పరమేశ్వరన్

ఐవీఆర్

బుధవారం, 24 ఏప్రియల్ 2024 (14:02 IST)
టిల్లూ స్క్వేర్. ఈ చిత్రంతో సిద్దు జొన్నలగడ్డ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కూడా విపరీతంగా ఫాంలోకి వచ్చింది. కానీ ఆ ఫామ్ వేరే రూట్లోకి వెళ్లిపోతోందట. టిల్లూ స్క్వేర్ చిత్రంలో హీరోకి కారులో ఇచ్చే లిప్ లాక్ సన్నివేశం చూసి కుర్రకారు చొంగకార్చుకుని గిలగిలలాడిపోయారు. ఒక్కదెబ్బకి అనుపమా పరమేశ్వరన్ రేంజ్ వేరే స్థాయికి వెళ్లిపోయింది.
 
అసలు విషయానికి వస్తే... ఇపుడు అనుపమా పరమేశ్వరన్ కి ఎక్కువగా అలాంటి ఆఫర్లే వస్తున్నాయంట. కనీసం మూడు నాలుగు లిప్ లాక్ సీన్లు వుంటాయనీ, చిత్రానికి అవే కీలకం అంటూ పలువురు దర్శకులు స్క్రిప్టులను పట్టుకుని అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వచ్చారంట. ఆ స్క్రిప్టులను చూసి పరమేశ్వరన్ ఓకే చెప్పాలో నో చెప్పాలో తెలియక సతమతమవుతోందట.
 
పైగా వచ్చినవారు బడా చిత్రాల నిర్మాతలు కావడంతో ఏం చేయాలా అని ఆలోచన చేస్తుందట. ఏదైనా అంతే.. ఒక్కసారి షో చూపిస్తే... అంతకుమించిన షో కావాలంటారు గ్లామర్ ఇండస్ట్రీలో. ఇదే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కి ఇబ్బంది పెడుతోందట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు