ఉప్పెన హీరోయిన్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమె పేరు క్రితిశెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవబోతున్న ఈ హీరోయిన్ కి అప్పుడే అవకాశాలు పోటెత్తుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఉప్పెన సినిమా నుండి రెండు పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి.