తెలంగాణాలో మూడు రోజుల వర్ష సూచన

ఠాగూర్

గురువారం, 7 ఆగస్టు 2025 (08:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందువల్ల పొలం పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలు, రైతులు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వాతావణ శాఖ అధికారులు సూచించారు. 
 
ముఖ్యంగా గురువారం నాడు రంగారెడ్డి, భువనగిరి, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, పాలమూరు జిల్లాల్లో, శుక్రవారం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, జనగామ, సిద్ధిపేట, భువనగిరి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం రోజున నాగర్ కర్నూల్, నిజామాబాదా, నిర్మల్, కుమురం భీమ్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు