ఇటీవలి ఫోటోసెషన్ ఇమ్మని అడిగితే చీర కట్టుకుని ఉన్న విద్యాబాలన్ తన ఎద ఒంపులను కనబడేట్లు ఎడాపెడా ఫోజులిచ్చేసింది. నిజానికి మహిళల ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించే కథానాయికల్లో విద్యాబాలన్ ముందుంటుంది. అందుకే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు అందచేసే పింఛను పథకానికి విద్యాబాలన్‌ను ప్రచాకర్తగా నియమించింది.
ఇటీవలే కేంద్ర పట్టు పరిశ్రమ శాఖ కూడా పట్టు బోర్డుకు విద్యాబాలన్‌నే ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంప్రదాయ వస్త్రాలతో అందరిని కైపెకిస్తూ.. కట్టూ, బొట్టుతో ఆకట్టుకోవడం విద్యాబాలన్ ప్రత్యేకత. ''నాకు పట్టు చీరలంటే ఎంత ఇష్టమో. ఎవరింట్లో శుభకార్యానికి పిలిచినా ఓ కొత్త పట్టు చీర కొనుక్కుని మరీ కట్టుకుంటా.