100 కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చిన దేవరకొండ

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (13:43 IST)
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన 'కుషి' చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం అభిమానుల నుండి మంచి స్పందనను అందుకుంది. 
 
ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తదనంతరం, సినిమా విజయవంతమైన సందర్భంగా, నటుడు విజయ్ దేవరకొండ తన సంపాదన నుండి 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున కోటి రూపాయలు ఇస్తానని వాగ్ధానం చేశాడు. 
 
ఈ మొత్తాన్ని హైదరాబాద్‌లో కుషి సక్సెస్ తర్వాత ఇస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం నటుడు విజయ్ దేవరకొండ 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున కోటి రూపాయలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు