బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేన అనుష్కల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇద్దరూ ఖండించినా.. ఉన్నట్టుండి.. ప్రముఖ విశ్లేషకుడు ఉమైర్ సంధు తన ట్వీట్లతో వీరి బంధాన్ని సెన్సేషన్ చేశాడు. డిసెంబరులో నిశ్చితార్థం అంటూ.. వారిద్దరి మధ్య సుమారు ఏడేళ్ల బంధం వుందని.. సరైన టైమ్‌లో వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమైర్ ట్వీట్స్ చేయడంతో.. ప్రభాస్, అనుష్కల ప్రేమాయణం మళ్లీ హైలైట్ అయ్యింది.
అయితే ప్రస్తుతం ఈ ట్వీట్స్ లోనూ నిజం లేదని చెప్పేందుకు ప్రభాస్ రంగంలోకి దిగాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అనుష్కతో బంధంపై ప్రభాస్ తమతో మాట్లాడినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. అనుష్కతో తొమ్మిది సంవత్సరాల పాటు సినిమాలు చేస్తున్నామని ప్రభాస్ తెలిపారు. అప్పటి నుంచి తమ మధ్య బంధం ఉంది. అయితే అది కేవలం స్నేహం మాత్రమే. అంతకుమించి తమ మధ్య ఎలాంటి బంధాలు లేవని ప్రభాస్ వివరణ ఇచ్చినట్లు తెలిపింది.
అయితే ఇది నిజమా కాదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే ప్రభాస్ స్వయంగా తన అధికారికంగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే వరకు ఈ ఎంగేజ్‌మెంట్, రిలేషన్ వార్తలు కొనసాగుతూనే ఉంటాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.