Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. కలిసొస్తుందా?

సెల్వి

బుధవారం, 3 సెప్టెంబరు 2025 (10:09 IST)
KCR_Kavitha
సెప్టెంబర్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) రాజకీయ పునరాగమనం కోసం ఆశలు పెట్టుకుంది. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన తర్వాత, తన పార్టీ అట్టడుగు స్థాయిలో ఆధిపత్యం చెలాయించగలదని కేసీఆర్ ఆశిస్తున్నారు. అయితే, ఇటీవలి పరిణామాలు ఆ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. 
 
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో పార్టీలో ఆందోళన రేకెత్తింది. తాజాగా బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం కూడా పార్టీకి ఇబ్బందుల్లో నెట్టేసింది. ఇది ఓటర్లను గందరగోళానికి గురిచేయవచ్చు. 
 
అంతర్గత విబేధాల కారణంగా పార్టీలో ఆందోళన కరమైన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో విజయవంతంగా తిరిగి రావాలనే కేసీఆర్ ఆశలు సుదూర కలగానే మిగిలిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు