బాహుబలిలో శివగామి, రెండు కట్టప్ప పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే శివగామి పాత్రలో రమ్యకష్ణ ఆకట్టుకుంది. ఈ పాత్రకు ముందుగా శ్రీదేవిని అప్రోచ్ అయ్యారని ఆమె భారీ రెమ్యునరేషన్ అడగడంతో ఆ తర్వాత టబు, సుష్మితా సేన్‌ను అడిగారని, వీరిద్దరూ కుదరకపోవడంతో, రమ్యకష్ణను తీసుకున్నారని రాజమౌళి చెప్పిన కథ ప్రచారంలో ఉంది. కానీ మరో కొత్త విషయం తెలుగులోకి వచ్చింది.
మంచు లక్ష్మిని ఈ పాత్ర కోసం రాజమౌళి అడిగారట. 'అనగనగా ఒక ధీరుడు' సినిమాలో ఐరేంద్రి పాత్రలో విలన్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించిన మంచు లక్ష్మీతో ఈ పాత్ర చేయించాలని రాజమౌళి అనుకున్నారట. అయితే, ప్రభాస్ తల్లిగా తను నటిస్తే బాగోదని లక్ష్మి ఈ ఆఫర్‌కు నో చెప్పిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ స్వయంగా చెప్పింది.