అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి వంటి టీవీ యాంకర్లు నటీనటులుగా తమ ప్రతిభను నిరూపించుకుంటుంటే.. హీరోయిన్లు టీవీ యాంకర్లుగా అవతారమెత్తనున్నారు. పలు టీవీషోల్లో కథానాయికలు జడ్జిలుగా కన్పిస్తున్న నేపథ్యంలో.. తాజాగా బొమ్మరిల్లు జెనీలియా టీవీ యాంకర్‌గా అవతారమెత్తింది.
ఓ టీవీ ఛానెల్‌లో రియాల్టీ షో కోసం ఇటీవలే నిర్వాహకుల్ని కలిసింది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్‌లో కూడా పాల్గొంది. రెండు వారాలపాటు ఈ కార్యక్రమం జరిగింది. మురికివాడల్లో ఈ చిత్రీకరణ సాగుతోంది. అక్కడి నివసించే చిన్నారులతో కలిసి సేవాకార్యక్రమాల్లో చిలిపినవ్వుల జెనీలియా పాల్గొననుంది.
ప్రస్తుతం జెన్నీ ఈ రియాల్టీ షో షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడనుంచి రాగానే.. "మగధీర" రామ్‌చరణ్‌తేజ సరసన అంజనా ప్రొడక్షన్స్‌పై రూపొందుతోన్న కొత్తి చిత్రంలో నటించనుంది. ఇంకేముంది..? టీవీ యాంకర్ అయినా జెనీలియా హీరోయిన్‌గానూ రాణిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..!.