మీటింగ్‌లో కోడిగుడ్లు విసిరిన "వైఎస్సార్"ను ఎలా ప్రమోట్ చేస్తారు..?

WD
దివంగత మహానేత, కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించనున్నట్లు ఇటీవలే పూరీజగన్నాథ్, హీరో రాజశేఖర్ దంపతులు ప్రకటించారు. దానికోసం 3 నెలలు కృషి చేయాలని, అందుకు సంబంధించిన విషయాలను సేకరించాలని నిర్ణయించామని చెప్పారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం తెరపైకి వచ్చే సూచనలు కన్పించడంలేదు. ఆదిలోనే హంసపాదులా.. ఈ చిత్రానికి పూరీ దర్శకుల శాఖలోని వారు మాత్రం సహకరిచడం లేదు. ఈ చిత్రాన్ని తీస్తే.. అంతా ఒకముద్ర ఏర్పడుతుందని, దానితో మిగిలిన సినిమాలకు పనిచేసే అవకాశాలు చేజారిపోతాయని పూరీతో దర్శకులు వెల్లడించినట్లు తెలిసింది.

ఈ సినిమా ప్రకటనముందే.. ఈ చిత్రం చాలా రిస్క్‌తో కూడుకుందని పూరీ సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో ధైర్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.

మరోరకంగా చూస్తే.. హీరో రాజశేఖర్‌ను ఉదయమే షూటింగ్‌కు తీసుకురావడం చాలా కష్టం. ఆ విషయాన్ని కూడా వారు పూరీ దృష్టికి తెస్తే.. అన్నీ మాట్లాడుకున్నాకే ఆయన అంగీకరించారని జగన్నాథ్ చెప్పారు.

అలాగే వై.ఎస్. పేదప్రజలకు చేసింది ఒక ఎత్తయితే ఆయనది మరో ఫ్యాక్షన్ కోణం. ఆ కోణంలో ఆయన్ని ఎలా చూపించాలో తర్జనభర్జనలు పడుతున్నారు. స్వర్గీయ పి.వి. నరసింహారావు మీటింగ్ పెడితే.. ఆయనపై చెప్పులు, టమోటాలు, కోడిగుడ్లు విసిరిన వై.ఎస్.ను మీరెలా ప్రమోట్‌చేస్తారని విలేకరులు అడిగితే.. అటువంటి కోణాలను కూడా ఆలోచిస్తున్నామని పూరి అస్పష్టమైన సమాచారం చెప్పారు.

ఇంతకీ పూరీ జగన్నాథ్‌కు వై.ఎస్ గురించి ఏమీ తెలియదు. ఏదో వైష్ణో అకాడమీ అని ప్రారంభించి సినిమాలు మొదలు పెట్టాడు. ఈ చిత్రానికి వై.ఎస్. జగన్ నాలుగు కోట్లు ఇచ్చారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్. మరి సినిమా ఎటువంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!.

వెబ్దునియా పై చదవండి