అందాల తార ప్రియమణి ద్విపాత్రాభినయం చేస్తున్న త్రిభాషా చిత్రం చారులత. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తుండటం విశేషం. చారులత తెలుగు వెర్షన్‌కు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
కె.భాగ్యరాజా, కె.ఎస్.రవి కుమార్ వద్ద శిష్యునిగా పని చేసిన పొన్ కుమరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు చెపుతూ... ఇటువంటి ఇతివృత్తంతో ఇంతవరకూ ఇండియన్ ఇండస్ట్రీలోనే సినిమా రూపొందలేదు. తొలిసారిగా ఇలాంటి కథతో ముందుకు వస్తున్నాం అన్నారు.
కాగా ఈ చిత్రంతో ప్రియమణి మరోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంటుందని అంటున్నారు. రెండు పాత్రలు వైరుధ్యంతో సాగుతాయనీ, ఒక పాత్రలో పూర్తి అందాల ఆరబోతకు ప్రాధాన్యమిస్తే మరొకటి కథకు ప్రాణంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రియమణికి మళ్లీ మరో బ్రేక్ రాబోతుందన్నమాట.