విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో... విజయ్ ఆంటోనీ 'బేతాళుడు' సినిమా (వీడియో)

శనివారం, 19 నవంబరు 2016 (09:01 IST)
సినిమా విడుదలకు ముందు అందులోని ప్రత్యేకతలన్నీ వీలైనంత వరకూ దాచి పెట్టడానికి ప్రయత్నారు ప్రతి నిర్మాత దర్శకుడు. ఎందుకంటే చిత్రంలోని ఏ చిన్న విషయం బయటకు పొక్కినా... సినిమా చూసేటప్పుడు ఆ అనుభూతి తగ్గుతుందన్నది వాళ్ల అభిప్రాయం. 
 
కానీ "బిచ్చగాడు"గా తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న విజయ్ ఆంటోనీకి అలాంటి భయమేమీ కనిపించడం లేదు. అందుకే తాను నటించిన తాజా చిత్రం "బేతాళుడు" సినిమాకు సంబంధించి 10 నిమిషాల నిడివి కలిగిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. ఈ చిత్రాన్ని తమిళంలో సైతాన్ పేరుతో నిర్మిచగా, తెలుగులో 'బేతాళుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. 
 
ప్రదీప్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని మొదటి 10 నిమిషాల సన్నివేశాల్ని యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ఓ సినిమా విడుదలకాక మునుపే అందులోని సన్నివేశాల్ని ఆన్‌లైన్‌లో పెట్టడం చర్చనీయాంశమైంది. ''కథాగమనం, పాత్రల ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పడానికి చేసిన ప్రయత్నమిద''ని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

 

వెబ్దునియా పై చదవండి