రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానరుపై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు అని చాలా మంది విమర్శించినా కూడా.. అనుకున్నది చేసి చూపించారు రాజమౌళి. బాక్సాఫీసు వద్ద రూ80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా చేసింది.
చిరుతతో బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన రాం చరణ్ రెండో ప్రయత్నంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన చిత్రంగా మగధీర మిగిలిపోయింది. పైగా, మెగాస్టార్ చిరంజీవిగా చెర్రీ గుర్తింపుపొందారు. అప్పటివరకు తెలుగు సినిమా కలలో కూడా చూడని కలెక్షన్లు మనకు పరిచయం చేసింది ఈ చిత్రం. పునర్జన్మ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.