పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్...? బాలయ్య కెరీర్‌లోనే?

మంగళవారం, 25 జులై 2017 (14:43 IST)
పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరలో టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. 
 
ఈ టీజర్లో మాస్‌ను ఆకట్టుకునే సీన్లుంటాయని సమాచారం. తప్పకుండా సినిమాపై పైసా వసూల్ టీజర్ మరింతగా అంచనాలు పెంచేలా ఉంటుందని సినీ యూనిట్ సమాచారం. ఇంతవరకూ బాలకృష్ణ సినిమాల్లో పైసా వసూల్ రూ.40 కోట్లకు పైగా వెచ్చించడంతో అత్యధిక బడ్జెట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఇంతవరకూ రూ.47 కోట్లు ఖర్చు చేశారట. మరో మూడు కోట్లవరకూ ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ జనం అంటున్నారు.
 
తాజాగా పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు రావడంతో ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ మినహా ఇతరులు ఆసక్తి చూపరని సినీ జనం అంచనా వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి