బాహుబలి మూడేళ్లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ సినీ ప్రపంచాన్ని తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసిన ''బాహుబలి'' ప్రారంభమై నేటితో (జూలై 6) మూడేళ్లు పూర్తయ్యింది. బాహుబలి ది బిగినింగ్.. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా రికార్డులను సృష్టిస్తుండగా, బాహుబలి ది కన్‌క్లూజన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌ను జక్కన్న రాజమౌళి యజ్ఞంగా చేస్తున్నారు. జక్కన్న క్లైమాక్స్ కోసం వెచ్చించిన మొత్తంతో మూడు, నాలుగు సినిమాలు తీసేయవచ్చునని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో బాహుబలి మూడేళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని ఆ సినిమా దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2013 జూలై 6న సెట్స్‌పైకి వచ్చిన బాహుబలి.. 2015 జూలై 10న విడుదలై భారతీయ సినిమా చరిత్రలో రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. దేశంలోన భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో డబ్బింగ్ చెప్పుకుని రిలీజైంది. ఈ నేపథ్యంలో బాహుబలితో మూడేళ్లు తనతో జర్నీ చేసిన వారందరికీ రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇకపోతే.. బాహుబలి పార్ట్ 2లో ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌పై మరోసారి భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకునే బాహుబలి-2 చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.