రవితేజతో ''ఛీ'' కొట్టించుకుంటాడు.. ఆయనెవరో తెలుసా?

సోమవారం, 5 సెప్టెంబరు 2016 (12:27 IST)
''ఖడ్గం'' సినిమాలో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అందరిని నవ్వుల్లో ముంచెత్తాడు… అలాగే చిన్న డైలాగ్‌ చెప్పలేక రవితేజతో ఛీ కొట్టించుకుంటాడు అతనే ''పృథ్వీరాజ్‌''. ''లౌక్యం'' చిత్రంలో తన అనుభవంతో హాస్యాన్ని ఇరగదీసిన నటుడు పృథ్వీరాజ్‌ షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 
 
సాయిధరమ్‌తేజ్‌ సినిమా ఫైటింగ్‌ సీక్వెన్స్‌లో గాయపడ్డానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పోస్ట్‌ చేశాడు. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. దీంతోపాటు ఆసుపత్రిలో తనప దిగిన రెండు ఫొటోలను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది.

వెబ్దునియా పై చదవండి