Hari Hara Veera Mallu OTT poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా అనుకున్నట్లుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీనిని రెండు భాగాలుగా రాబోతుందని ముగింపు చూస్తే అర్థమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని తీసే ఆలోచన లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకు అనుకున్నంతగా రాకపోవడంతో ఓటీటీలో కొంత సేఫ్ అనే ఆలోచనలో నిర్మాత వున్నారు.