సాధారణంగా హీరోలు... హీరోయిన్లు నిరతరం తమ ఫిట్నెస్ని కాపాడుకుంటూ వస్తారు. ఇందుకోసం వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. శరీరంలోని ఏ ఒక్క భాగం పెరిగినా.. దాన్ని తక్షణం తగ్గించుకునేందుకు గంటల తరబడి కుస్తీలు పడుతుంటారు. అలాంటిది ఓ బాలీవుడ్ తనకు వచ్చిన బాన పొట్టను తగ్గించుకునేందుకు ఏకంగా కొన్ని నెలల పాటు కఠోరంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు ఆమిర్ ఖాన్.