మేకర్స్ అమీర్‌ఖాన్ ని దహాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.
రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.
కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.
ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్