మాస్టర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌లో ప్రభుదేవా తన స్టెప్పులతో అందరినీ మెప్పించేశాడు. ఇక ఈ అబ్బాక డర్ అనే పాట వినోదాత్మకంగా సాగుతుంది. ఇందులో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరికి అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఈ పాటను పిల్లలు చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డి ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా.. ఆదిత్య సురేష్, సహన ఆలపించారు. డా. చల్లా భాగ్యలక్ష్మీ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలను నందు తుర్లపాటి అందించారు.
అశ్వంత్ తల్లిగా రమ్యా నంబీశన్ కనిపించనున్నారు. పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత వంటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా నటించారు. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, అలియా, సురేష్ మీనన్, లొల్లు సభా స్వామినాథన్ ముఖ్య పాత్రలను పోషించారు.