వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్ జిల్లాని అర్వింద్ పటేల్ అనే వ్యక్తి.. చందౌలి జిల్లా హమీద్‌పూర్‌కు చెందిన రీనా అనే మహిళను 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు సియారామ్ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయమే క్రమంగా వివాహేతర సంబంధం వరకు దారి తీసింది. దాదాపు 20 ఏళ్లుగా వీళ్ల మధ్య వివాహేతర సంబంధం అలా సాగుతూనే వస్తోంది.
అర్వింద్ పటేల్‌కు వాళ్లపై అనుమానం రావడంతో పలుసార్లు పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈసారి రెడ్ హ్యాండెడ్‌గా వాళ్లిద్దరూ దొరికిపోయారు. ఈ ఘటనపై అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సియారామ్, అలాగే తన భార్య కుటుంబీకులకు కూడా ఈ విషయం చెప్పాడు.