అయితే తనకు ఇంకా 56 లక్షలు ఇవ్వాల్సి వుందనీ, అగ్రిమెంట్ ప్రకారం ఏవీ సరిగ్గా జరగలేదంటూ విమర్శిస్తూ చట్టపరంగా రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వారికి తెలియజేసింది. దానిపై మంగళవారం రాత్రి ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ MD శ్రీ శరవణ ప్రసాద్ అధికారిక ప్రకటన జారీ చేశారు.
అందులోని సారాంశం ప్రకారం ఆమె సరిగ్గా ఛెఫ్ కార్యక్రమానికి రావడంలేదనీ, అనుకున్నట్లు ఆమెకు ముందుగా కోటి రూపాయలు ఇచ్చామని తెలియజేస్తూ ఓ లెటర్‌ను విడుదల చేసింది. ఇందుకు చట్టపరంగా తామూ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
అసలు బెంగుళూరు ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు చాలా వెచ్చించారు. దక్షిణాదిలోని తెలుగు, కన్నడం, తమిళ మీడియా ముందు తమన్నా ఈ చెఫ్ గురించి గొప్పగా చెప్పింది. కానీ అప్పట్లోనే ఆమె లేట్‌గా రావడం అందుకోసం మీడియా గంటలతరబడి వెయిట్ చేయడం జరిగింది.