ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ``నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాను. సినిమాల్లో డైరెక్టర్ ఆలోచనా శైలి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ.. వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే రైటర్స్, యాక్టర్స్ శైలి కనిపిస్తుంది. సినిమాల్లో కట్ టు కట్ చక చకా ఉంటుంది. లెవన్త్ అవర్ విషయానికి వచ్చేసరికి త్వరత్వరగా చేసేయాలని కాకుండా కాస్త రియల్ టైమ్ పెర్ఫామెన్స్‌కు దగ్గర చేయగలిగాను. లెవన్త్ అవర్‌లోని అరత్రికా రెడ్డి సమాజంలోని చాలా మంది మహిళలకు రెఫరెన్స్ అనొచ్చు. ఇందులో ఆమెతో ఉన్న మగవాళ్లు ఎవరూ ఆమె జీవితంలో పోరాటం చేస్తుందని నమ్మరు. ఇలాంటి ఓ పాత్రను ఇచ్చినందుకు నిర్మాత ప్రదీప్‌గారికి, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుగారికి, అల్లు అరవింద్‌గారికి థాంక్స్.
ఫీచర్ ఫిలింలో చూపించలేని యాక్టింగ్ స్పేస్‌ను ఓటీటీలో చూపించవచ్చు. వెబ్ సిరీస్‌ల్లో నటిస్తాను. ఇది వరకు తమిళంలోనూ ఓ వెబ్ షో చేశాను. అయితే స్క్రిప్ట్ నచ్చాలి. మంచి పాత్ర దక్కాలి. వెబ్ సిరీస్ అనేది రైటర్స్, యాక్టర్స్ మీడియం. స్క్రిప్ట్, పాత్ర ఆసక్తికరంగా లేకపోతే ఎవరూ చూడలేరు. లెవన్త్ అవర్ స్క్రిప్ట్ చదవగానే .. బాగా నచ్చడంతో చేయాలనిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టర్స్ అందరూ ఓటీటీ మీడియంలోకి ఎక్స్‌ప్లోర్ కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అందరికీ మంచి అవకాశాలు వస్తాయి. ప్రతిరోజూ నా లైఫ్‌లో లెవన్త్ అవర్ అనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఓషెడ్యూల్ తర్వాత కరోనా వచ్చింది. దాంతో మూడు వారాల గ్యాప్ వచ్చింది. కానీ ప్రవీణ్‌గారు అండ్ టీమ్ సపోర్ట్‌తో అనుకున్న సమయం కంటే పూర్తి చేయగలిగాను. ఈ సందర్భగా ప్రవీణ్‌గారికి, ప్రదీప్‌గారికి, ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది`` అన్నారు.