లైవ్‌లో విషం తాగిన నటుడు- ఇంటికి వెళ్లి చూస్తే..?

బుధవారం, 14 జూన్ 2023 (16:13 IST)
Tirthanand Rao
బాలీవుడ్ స్టార్ కపిల్ శర్మతో కలిసి పనిచేసిన నటుడు తీర్థానందరావు ఫేస్‌బుక్‌లో లైవ్‌లో విషం తాగాడు. తనను ఓ మహిళ డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతుందని.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. 
 
తనపై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టిందని చెప్తూ ఎఫ్‌బీ లైవ్‌లో కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా చెప్తూనే ఒక్కోసారిగా విషం తాగేశాడు. దీన్ని చూసిన అతని స్నేహితులు ఇంటికి వెళ్లారు. 
 
తీర్థానంద రావు అపస్మారక స్థితిలో వున్నాడు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించిన వైద్యులు ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు