మలయాళ హీరోయిన్‌పై అత్యాచారం... విచారణకు వచ్చిన హీరో

ఆదివారం, 23 జనవరి 2022 (13:01 IST)
మలయాళ హీరోయిన్‌పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ హీరో దిలీప్ విచారణ నిమిత్తం పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ఇప్పటికే అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ పొందాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడు అనూప్, బావ సూరజ్‌లు కూడా అతని వెంట వచ్చారు. 
 
కాగా, గత 2017 ఫిబ్రవరి 17వ తేదీన మలయాళ హీరోయిన్‌ను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. 
 
వారిని కూడా దిలీప్ బెదిరించారని అధికారులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్‌ కూడా ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఓ విచారణ అధికారి కూడా ఆయనకు ఫిర్యాదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు