షెడ్యూల్డ్ కులాలను ఇండస్ట్రీ నుంచి తరిమివేయాలి.. మీరా మిథున్

సోమవారం, 9 ఆగస్టు 2021 (12:16 IST)
తమిళ సినీ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్లే తనకు మంచి అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించింది. వీరిని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతులు బాగుండవని. అనేక నేరాలతో కూడా వారికి సంబంధాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. 
 
డైరెక్టర్లు, యాక్టర్లు, ఎవరైనా సరే ఆ కులం వాళ్లు వుంటే బయటకు పోవాలంటూ మీరా అన్నారు. షెడ్యూల్డ్ కులాల వారీ వల్లే క్వాలిటీ సనిమాలు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. దళితులను ఉద్దేశించి మీరా మిథున్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
 
ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మీరా మిథున్ వ్యాఖ్యలపై ఒక్క తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాలే కాదు.. అన్ని బాషల సినీ పరిశ్రమలో దుమారం రేగుతుంది. తమిళనాడులో ఇప్పటికే మీరా మిథున్ వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ సహా ఏడు జిల్లాలో మీరాపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు కాగా ఆమె మాట్లాడిన వీడియో ఆధారంగా తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పలువురు స్టార్స్‌ని టార్గెట్ చేస్తూ, ఆమె చేసిన కామెంట్స్ గతంలో వివాదాస్పదమయ్యాయి. తాజాగా దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లోకి నెట్టేశాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు