ఎక్కడికి వెళ్ళినా ఖైదీ కార్తీ అని పిలుస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది: హీరో కార్తీ

గురువారం, 31 అక్టోబరు 2019 (22:38 IST)
యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
 
రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షకాదరణతో ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణతో ఆల్ సెంటర్స్ హౌస్‌ఫుల్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో బుధవారం సక్సెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ స‌క్స‌స్ మీట్లో యాంగ్రీ హీరో కార్తి మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్‌. సినిమాకు ఘన విజయాన్ని అందించారు. నన్ను ఇంతకముందు ఆవారా కార్తీ అనేవారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళినా ఖైదీ కార్తీ అని పిలుస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. 
 
తమిళనాడు, కేరళ, వరల్డ్‌ వైడ్‌ సినిమాకు సేమ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పండగ ప్రతి ఒక్కరికీ ఇంపార్టెంట్‌. చాలా రోజుల తర్వాత పండక్కి నా సినిమా విడుదలైంది. హీరోయిన్‌, పాటలు లేకుండా పండగ సినిమా అంటారేంటి? అని ఎవరైనా అడుగుతారేమోనని అనుకున్నాం.
 
 సినిమా చూస్తే అందరికీ నచ్చుతుందనేది మా కాన్ఫిడెన్స్‌. ఈ రోజు ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందని చెబుతున్నారు. ‘ఖైదీ’లో యాక్షన్‌ ఉంది. మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కామెడీ ఉంది. తండ్రి, కుమార్తె మధ్య ఎమోషన్‌, సెంటిమెంట్‌ ఉన్నాయి. 
 
ఇటువంటి సినిమా, క్యారెక్టర్‌ నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక పాప ఉండటంతో క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాను. దర్శకుడు లోకేష్‌ తీసిన విధానం, రాసిన విధానం చాలా అద్భుతమని చెప్పాలి. ఒక పక్క లారీలో యాక్షన్‌ జరుగుతుంటుంది. మరో పక్క ఎస్పీ ఆఫీసులో ఇంకో విషయం జరుగుతుంటుంది. ప్రేక్షకులను ఒక్క నిమిషం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా దర్శకుడు సినిమా తీశాడు.
 
నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. నాకు ఒక బామ్మ ఫోన్‌ చేశారు. వీడియోలో రివ్యూ చెప్పారు. మంచి సినిమా, గొప్ప సినిమా తీశానని ప్రశంసించారు. 
 
యాక్షన్‌ సినిమా బామ్మకు నచ్చింది. అదే నిజమైన సక్సెస్‌. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్‌.ఆర్‌. ప్రభుకు థ్యాంక్స్‌. ‘అన్నయ్యా… ఒక చిన్న కథ ఉంది. వినండి. ప్రయోగాత్మక సినిమా’ అని అతను అన్నాడు. కథ విని ‘అరే… ఇది చిన్న సినిమా కాదు. చాలా పెద్ద సినిమా’ అన్నాను. కథ విన్నాక ఇంగ్లిష్‌ సినిమాలా తీయాలనుకున్నాం తీశాం. ప్రేక్షకులు ఆ మాట చెబుతుంటే సంతోషంగా ఉంది. క్లైమాక్స్‌లో గన్‌ పట్టుకుని వస్తుంటే ‘హ్యాపీ దీపావళి’ అని థియేటర్లలో ఆడియన్స్‌ అరుస్తున్నారు. 
 
‘ఖైదీ’ టైటిల్‌ పెడితే సినిమా హిట్‌ అనే సెంటిమెంట్‌ మరోసారి వర్కవుట్‌ అయ్యింది. తెలుగులో బెస్ట్ రిలీజ్ ఇచ్చిన సత్యసాయి ఆర్ట్స్ రాధామోహన్ గారికి థ్యాంక్స్. మా అన్నయ్య సూర్యగారు రెండుసార్లు సినిమా చూశారు. చాలా బావుందని మెచ్చుకున్నారు. రవితేజగారు ఫోన్‌ చేశారు. ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ప్రేక్షకులు ఆదిరిస్తే ఇటువంటి సినిమాలు మరిన్ని చేయగలం. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది. ‘30 రోజులు డేట్స్‌ ఇస్తే తీస్తాం అని ప్రభు అడిగాడు. ఈసారి నైట్స్‌ కాకుండా డేలో తీయమని అడిగా. తప్పకుండా ‘ఖైదీ 2’ ఉంటుంది’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు