నటీమణులకు రక్షణ కరువైంది. ఈ మధ్య నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన మోడల్, నటి కృతికాచౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని అంధేరీలో వుంటున్న ఆమె ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.