ముఖ్యంగా, బీపీఎం అనే క్లబ్‌తో తనకున్న సంబంధాలను తెలుసుకునేందుకు విచారణకు పిలిచారని, ఈ విషయంలో కొంత సమాచార సేకరణ కోసమే వారు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అదేసమయంలో తాను ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు. శాఖకు చెందిన రామ్ చందర్ వద్ద నేను డ్రగ్స్ కొనలేదని, గతంలో పబ్ నిర్వహించినందువల్లే తనను విచారించారని తెలిపారు.
గతంలో సిట్, ఈడీ కూడా విచారించిందని, ప్రస్తుతం నార్కో పోలీసులు విచారిస్తున్నారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారని నవదీప్ వెల్లడించారు.
తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, తెలంగాణ నార్కో విభాగం అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందని నవదీప్ తెలిపారు. కాగా, నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.