దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. ఫొటో కోసం అనుకున్నాను. అంతలో ఫొటోగ్రాఫర్ ఆమె పక్కకు వెళ్లి నిల్చొమని అతడికి చెప్పాడు. వాళ్లిద్దరూ స్నేహితులేమో అనుకున్నా. కానీ, అతడు నాకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించింది. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాను. వ్యక్తిగత అంగరక్షకులను పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకూ బాడీ గార్డ్స్‌ను పెట్టుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించాలేమో' అని శ్రుతి హాసన్ చెప్పారు.
ఇకపోతే, తన సినిమాల విషయాలపై స్పందిస్తూ, ప్రస్తుతం సలార్ చిత్రంలో నటించానని త్వరలోనే విడుదలకానుందని చెప్పారు. ఆ తర్వాత నాని హీరోగా తెరెక్కుకుతున్న హాయ్ నాన్న చిత్రంలో నటిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.