బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ భార్యను ఇంటి నుంచి గెంటేశాడా?

శనివారం, 4 మార్చి 2023 (11:15 IST)
బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం విమర్శల పాలవుతున్నారు. నవాజుద్దీన్ తనను ఎంతో హింసిస్తున్నాడని ఆయన భార్య అలియా సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేసింది. నవాజుద్ధీన్ కొన్ని రోజులుగా ఇంట్లోనే బందీని చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. 
 
తాజాగా భార్యాపిల్లలను ఇంటి నుంచి గెంటేశాడని తెలిసింది. తాను పోలీస్ స్టేషన్ కి వెళ్లొచ్చేసరికి ఆయన కాపలాదారులు తనను ఇంట్లోకి రానివ్వలేదని ఆమె తెలిపింది. 
 
అంతేకాదు తన పిల్లలతో కలిసి గేటు బయట ఆమె ఏడుస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు