బోయపాటి మా ఆవిడతో చీప్‌గా బిహేవ్‌ చేశాడు : పోసాని కృష్ణమురళి

సోమవారం, 17 అక్టోబరు 2016 (13:32 IST)
గురువు దగ్గర శిష్యరికం చేస్తున్న శిష్యులు.. గురువు భార్యను గౌరవిస్తూ మాట్లాడుతుంటారు. అలా మాట్లాడనివారికి సంస్కారం లేదని అర్థం. అది బోయపాటి శ్రీనుకు లేదని రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి విమర్శిస్తున్నారు. పోసాని చాలామంది సీనిర్‌ రచయితల దగ్గర శిష్యరికం చేశాడు. తన దగ్గర కొంతమంది పనిచేశారు. అందులో బోయపాటి ఒకరు. 
 
ఇలా శిష్యుల్ని తయారుచేసుకున్న పోసాని.. ఓ ఇంటర్వ్యూలో.. మీ శిష్యులు వున్నతికి ఎదిగాక ఎలా అనిపిస్తుందని అడిగితే.. దాదాపు 30 మంది నా వద్ద పనిచేశారు. అందరూ మంచి పొజిషన్‌లో వున్నారు. బోయపాటి శ్రీను పేదవాడు కనుక. నా మనిషని.. అతడిని ప్రోత్సహించి ముత్యాల సుబ్బయ్య దగ్గర పెట్టాను. ఓసారి నేను తీసిన సినిమా ప్లాప్‌ అయింది. ఆ సినిమా గురించి మా ఆవిడతో.. మేమంటే డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాం. అన్నయ్య చేయలేదు. అందుకే పోయింది. 
 
ఇంటికి సంబంధించిన బిల్లులు కట్టుకోవడానికి కష్టపడాలేమో కదా వదినా అంటూ హేళనగా మాట్లాడాడు. అలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు అర్థంకాలేదు. అది చీప్‌ మెంటాలిటీ.. మనిషి మంచోడే. గుణం గుడిచేటిది.. అన్నట్లు ఆయన ప్రవర్తన వుందంటూ.. స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కాగా, ఇటీవలే కొరటాల శివ కూడా బోయపాటి మెంటాలిటీపై చురకలు వేశాడు కూడా. తన కథను తీసుకుని 'సింహా' చిత్రానికి ఆయన పేరు వేసుకున్నాడని.. చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి