ఇటీవల హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. అయితే ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా, పలు సంచలన విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తుంది.
భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారని, ముందస్తు సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు గుట్కా బాక్సులు స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందట. అయితే అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ని బెయిల్‌పై విడుదల చేశారని సమాచారం.
ఓ వైపు ముంబయి, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నారట. దీంతో అక్రమంగా భారీగా సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంటుంది.
ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించిన నేపథ్యంలో సచిన్‌ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సచిన్ జోషి `మౌనమేలనోయి`, `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్ పండు`, `ఆజాన్`, `జాక్‌పాట్`, `వీరప్పన్`, `వీడెవడు`, `నెక్ట్స్ ఏంటీ`, `అమావాస్` చిత్రాల్లో నటించారు.