పెళ్లెందుకు చేస్కోవాలి? వెళ్లి జయలలితను అడగండి... సుమంత్‌ చమక్కులు

బుధవారం, 2 నవంబరు 2016 (18:45 IST)
ఎవరి పెళ్ళికైనా నేను వెళతాను.. అఖిల్‌, చైతన్యల పెళ్లిళ్లకు వెళ్ళడమే.. కానీ నా పెళ్లికి నేనే వెళ్ళను.. అంటూ నటుడు సుమంత్‌ తేల్చి చెప్పాడు. అలా ఎందుకనిపించింది? పెళ్ళి చేసుకోరా అంటే?. పెళ్ళెందుకు చేసుకోవాలి. పెళ్ళి లేకుండా వుండలేమా? జయలలితను అడగండి.. అంటూ చమక్కులు విసిరారు. 
 
సినిమా కెరీర్‌ గురించి పెద్దగా ఆలోచించడంలేదు. వచ్చినప్పుడు చేయడమే. అయితే.. నరుడా డోనరుడా.. సినిమా విడుదల తర్వాత రిజల్ట్‌ను బట్టి.. తదుపరి చిత్రాల గురించి ఆలోచనలో వున్నానని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి