అడిగినంత ఇస్తేనే మీకు కోఆపరేట్ చేస్తా : తేల్చి చెప్పిన హీరోయిన్

ఆదివారం, 19 నవంబరు 2017 (14:51 IST)
తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే మీరు కోరినట్టుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హీరోయిన్ అదితి రావు దర్శకనిర్మాతలకు తేల్చి చెప్పారు. పైకా, తనకు ఇస్తానని పారితోషికంలో ఒక్కపైసా తగ్గినా సినిమాలో నటించే ఛాన్సే లేదని ఆమె స్పష్టంచేశారు.
 
తెలుగులో ఉన్న కొత్త కారు హీరోయిన్లలో అదితి రావు ఒకరు. ఈమె హిందీ సినిమాలకి ప్రాధాన్యతనిస్తున్న విషయం తెల్సిందే. వీలును బట్టి తమిళ .. మలయాళ సినిమాలపై కూడా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి కూడా ఆమెకి ఓ ఛాన్స్ వెళ్లింది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా సుధీర్ బాబును తీసుకున్నారు.
 
ఇక హీరోయిన్‌గా అదితీరావుతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చేయడానికి అంగీకరించిన అదితీరావు.. పారితోషికంగా రూ.50 లక్షలు అడిగిందట. ఓ మాదిరి బడ్జెట్ సినిమా కావడంతో అంత ఇచ్చుకోలేమని అన్నరట. అయితే కష్టం అన్నట్టుగా ఆమె చెప్పారట. అదితి మాత్రం.. తాను అడిగినంత ఇస్తేనే కోఆపరేట్ చేస్తానని తేల్చి చెప్పిందట. దీంతో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు