వామ్మో... రెస్టారెంట్లోకి దూసుకు వచ్చిన చిరుతపులి (video)

ఐవీఆర్

మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (15:09 IST)
ఈమధ్య కాలంలో చిరుతపులులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పలుచోట్ల ప్రజలపై దాడులు కూడా చేస్తున్నాయి. ఐతే అటవీ ప్రాంతాలను కొట్టివేస్తుండటంతో జంతువులు ఇలా జనావాసాల్లోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే నీలగిరి జిల్లా కోటగిరి ప్రాంతంలో ఓ చిరుతపులి హడలెత్తించింది.
 
పిల్లిని వేటాడేందుకు ఒక రెస్టారెంట్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. రెస్టారెంట్ లోపల కూర్చున్న వ్యక్తి చిరుతను చూసి ప్రాణ భయంతో పారిపోయాడు. నీలగిరి జిల్లా కోటగిరి సమీపంలోని ఒక ప్రైవేట్ టీ ఎస్టేట్‌ వద్ద పిల్లి కోసం చిరుత తొలుత మాటువేసి కూర్చుంది. పిల్లి కంటబటంతో ఒక్క ఉదుటున అక్కడ నుంచి లేచి పిల్లి కోసం రెస్టారెంట్ లోపలకి ప్రవేశించింది. లోపల కూర్చున్న వ్యక్తి చిరుతను చూసి జడుసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. చిరుత మాత్రం పిల్లిని పట్టుకునేందుకు దాని వెంటబడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

பூனையை வேட்டையாட உணவு விடுதிக்குள் புகுந்த சிறுத்தை... உள்ளே அமர்ந்திருந்த நபர் சிறுத்தையை பார்த்ததும் உயிர் பயத்தில் சிதறி ஓட்டம்... நீலகிரி மாவட்டம் கோத்தகிரி அருகே உள்ள தனியார் தேயிலை தோட்டத்தில் நடந்த சம்பவம்#Nilgiris | #Ooty | #Leopard | #CCTV | #ForestDept pic.twitter.com/dk6il952po

— Polimer News (@polimernews) September 30, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు