అయితే, పార్లమెంట్ చూడాలని ఎన్నాళ్లనుంచో ఉన్న కోర్కెను కూడా తీర్చేసుకుంది అంజలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో కలిసి అంజలి పార్లమెంట్‌ను సందర్శించింది. పార్లమెంట్ భవనాన్ని కలియతిరిగి ఆవరణలో ఎంపీ గీతతో కలిసి ఫొటోలు దిగి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్లిన అంజలి... త్రికూట పర్వతాల్లో కత్రా నుంచి 13.5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో దిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అంజలి తనకు రాజకీయాలు అంటే ఇష్టమేనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అంటే మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంది.