నటి అర్చన అలియాస్ వేదకు నిశ్చితార్థం .. వరుడు ఎవరంటే?

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (11:49 IST)
గత 2004లో తెలుగు వెండితెరకు "నేను" అనే చిత్రం ద్వారా పరిచయమైన నటి అర్చన. ఆ తర్వాత తన పేరును వేదగా మార్చుకుంది. రియాల్టీ షో బిగ్ ‌బాస్ షో మొదటి సీజన్‌లో నటించింది. అయితే, 'నేను' చిత్రం తర్వాత పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. అయితే, ఆమె ఖాతాలో సరైన హిట్ లేకపోవడంతో ఆమె వెండితెరకు దూరమైంది. 
 
ఈ క్రమంలో ఆమె ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు జగదీశ్‌తో ప్రేమలో పడింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు... గత నెలలో ప్రియుడు జగదీశ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, త్వరలోనే శుభవార్త వింటారని కామెంట్స్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో జగదీశ్‌తో టాలీవుడ్ నటి అర్చన నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి నటులు నవదీప్, శివబాలాజీ, సుమంత్, నటి మధుమిత తదితరులతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు