ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, లిక్కర్ వ్యాపారి, రియల్టర్ బాలాజీ పోతరాజ్‌తో తనకు 2006లో వివాహమైంది. గత నెల రోజులుగా ఆయన వేధింపులను భరించలేకపోతున్నాను. ఎక్కడకు వెళ్లినా గన్‌మెన్‌ను నా వెంట పంపుతున్నాడు. ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి నాపై దాడి చేశాడని తెలిపింది.
ఆ దాడిలో తలను గోడకేసిన కొట్టాడు. నోరు, ముక్కు నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోలేదు. తనను హత్య చేయాలనుకున్నాడు. గొంతు పట్టుకుని పొట్ట, ఇతర భాగాలపై దాడి చేశాడు. నేను స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో వదిలిపెట్టి వెళ్లాడు. తనను తొలగించుకునేందుకు తన భర్త వేధింపులకు దిగుతున్నాడని చైత్రా పేర్కొంటూ అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.