'రాగల 24 గంటల్లో' విప్పి చూపిస్తానంటున్న ఈషా రెబ్బా

బుధవారం, 10 జులై 2019 (12:16 IST)
పర భాషలకు చెందిన హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా తమ అంద చందాలతో కుర్రకారును ఫిదా చేస్తున్నారు. దీనికితోడు వారు నటించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా రెబ్బాకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 
 
అటు నటన పరంగాను.. ఇటు గ్లామర్ పరంగాను నిలబడింది. అయితే సక్సెస్‌లు రాకపోవడంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఆమె గ్లామర్‌ను ఒలకబోయకపోవడమే అవకాశాలు తగ్గడానికి కారణమనే టాక్ కూడా వుంది. 
 
ఈ పరిస్థితుల్లో ఈషా రెబ్బా తాజాగా ఆమె "రాగల 24 గంటల్లో" అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ఢమరుకం చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇందులో బికినీతో ఈషా రెబ్బా ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందని అంటున్నారు. పాత్ర పరంగా గ్లామర్ డోస్ పెంచేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో ఆమెకి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి మరి. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు