ప్రగతి గ్లామర్ అదరహో... ఆ ఫోటోలతో ఊపేస్తోంది...

బుధవారం, 22 జనవరి 2020 (18:34 IST)
మొన్న సురేఖ ఈ రోజు ప్రగతి. యంగ్ ఏజ్‌లోనే తన వయస్సుకి సమానంగా ఉండే హీరోహీరోయిన్లకు తల్లిగా నటించి మెప్పించింది నటి ప్రగతి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది. యంగ్ ఏజ్‌లోనే తన వయస్సుకి సమానంగా ఉండే హీరో, హీరోయిన్లకు తల్లిగా నటించి మెప్పించింది నటి ప్రగతి.
 
ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది. యేడాదికి సుమారు 25 చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు గ్లామర్ తెస్తుంది. యంగ్ మదర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరే ప్రగతి. కెరీర్ ఆరంభంలో ఈమె తమిళ చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది కూడా. తెలుగులో అలాంటి అవకాశాలు రాకపోవడంతో తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఏమైంది ఈ వేళ సినిమాలో ప్రగతి పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం దక్కించుకుంది. ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూరు సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కూడా కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్సకుడు భాగ్యరాజ్ తన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. 
 
రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలయాళం సినిమాలో నటించింది. ఆ తరువాత వివాహం కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం కూడా తీసుకుంది. మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలలో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. ఇలా తానేంటో నిరూపించుకుంటున్న ప్రగతి ప్రస్తుతం స్లీవ్‌లెస్ డ్రస్సులో కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రాంలో ఫోటోలను పెడుతూ తన అభిమానులను మెప్పిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు