దేహమే ఓ ఆలయం అంటోంది బాలీవుడ్ నటి పూజా హెగ్డే. అందువల్ల సినిమాల్లో గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తోంది. అసలు విషయానికి వస్తే, మిస్‌వరల్డ్ అందాల పోటీలో పాల్గొని మూడో స్థానానికి పరిమితం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి, ఆపై సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
అనంతరం మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ముగమూడి' చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాహెగ్డేను తమిళసినిమా మరచిపోయింది. దీంతో ఆ ఒక్క చిత్రంతోనే పూజాహెగ్డే తట్టాబుట్టా సర్దుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎంట్రీ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో జతకట్టి హిట్స్‌ను తన ఖాతా లో వేసుకుంది.
ముఖ్యంగా కోలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశ మాత్రం పోలేదట. అందులో భాగంగానే అందరి హీరోయిన్ల మాదిరి గానే అందాలు ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసుకుని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలపై నెటజిన్లే కాదు, సినీ అభిమానులు కామెట్స్ చేస్తున్నారు. కొందరైతే తీవ్రంగా విమర్శి స్తున్నారు.
దీంతో అలాంటి వారికి బదులిచ్చే విధంగా నటి పూజాహెగ్డే దేహమే ఆలయం అని మన పెద్దలు అన్నారని, అదే విధంగా తన దేహాన్ని తాను ఆరాధిస్తానని చెప్పింది. అంతే కాకుండా అందాలను ప్రదర్శిస్తున్నాను.. ఇందులో తప్పేముంది? మీరు అంతగా ఇదైపోవాల్సిందేముంది?అని ఎదురు ప్రశ్న వేసింది. ఈ అమ్మడు సమాధానంతో ఏ ఒక్క నెటిజన్ నోరు మెదపడం లేదు.