జగన్‌తో నాకెలాంటి లింకు లేదు.. వివరణ ఇవ్వడం వేస్ట్ ఆఫ్ టైమ్: ముమైత్

మంగళవారం, 16 ఆగస్టు 2016 (09:22 IST)
దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో తనకెలాంటి లింకు లేదని ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ వెల్లడించింది. పూరీ జగన్నాథ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ముమైత్ ఖాన్ క్లారిటీ ఇచ్చింది. పూరీతో పోకిరి చేసినప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం ఉందని.. ఆడామగా ఒకరికొకరు స్నేహితులుగా ఉంటే.. క్లోజ్‌గా ఉంటేనే వారి మధ్య అఫైర్ వుందంటూ వార్తలు రావడం సహజమని చెప్పింది. 
 
ఇలాంటి వదంతులకు వివరణ ఇచ్చుకోవడం వేస్ట్ ఆఫ్ టైమ్ అంటూ ముమైత్ ఖాన్ చెప్పింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ సాంగ్‌కు మంచి ఆదరణ లభించింది. 2006లో ఈ సాంగ్ టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.  

వెబ్దునియా పై చదవండి