అయ్యబాబోయ్.. కోహ్లీతో ఆ సంబంధమా.. తమన్నా ఏం చెప్పిందంటే?

శనివారం, 2 మార్చి 2019 (09:54 IST)
బాలీవుడ్ హీరోయిన్ అనుష్కతో ప్రేమాయణానికి ముందు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో తమన్నా, విరాట్ కోహ్లీ ఇద్దరూ స్పందించలేదు. అంతలోనే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయినట్లు కథనాలు వచ్చేశాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ వ్యవహారంపై స్పందించింది. 
 
తాను విరాట్ కోహ్లీతో యాడ్ షూటింగ్‌లో నటిస్తున్నప్పుడు కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడలేదని తమన్నా క్లారిటీ ఇచ్చింది. 2012లో ఓ యాడ్ కోసం తామిద్దరం పనిచేశామని.. ఆ తర్వాత తాను విరాట్‌ను కలవలేదని.. కనీసం మాట్లాడలేదని చెప్పింది. 
 
కానీ తాను పనిచేసిన హీరోలతో పోలిస్తే కోహ్లీ ఎన్నో రెట్లు నయమని కితాబిచ్చింది. ఇక తాను అమెరికాకు చెందిన వైద్యుడిని వివాహం చేసుకోబోతున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తమన్నా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు